రేపు ‘కన్నప్ప’ ఫస్ట్‌ లుక్‌

Mar 7,2024 19:30 #movie, #vishnu

మంచు విష్ణు నటిస్తున్న ‘కన్నప్ప’ చిత్రం నుండి ఈ రోజు (మార్చి 8) ఫస్ట్‌ లుక్‌ విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా పూర్తిగా న్యూజిలాండ్‌ లోనే చిత్రీకరణ జరుపకుంటోంది. ఇటీవలె ఈ రెండో షెడ్యూల్‌ను ప్రారంభించారు. మోహన్‌లాల్‌ మోహన్‌బాబులతో పాటు ఇండియాలోని టాప్‌ స్టార్లు, హాలీవుడ్‌ టెక్నీషియన్లు పని చేస్తున్న ఈ చిత్రానికి మహాభారతం సీరియల్‌ ఫేమ్‌ ముఖేష్‌కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి హాలీవుడ్‌ సినిమాటోగ్రాఫర్‌ షెల్డన్‌ చౌ పని చేస్తున్నారు. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్లపై మోహన్‌ బాబు నిర్మిస్తున్నారు.

➡️