రేపు ‘గేమ్‌ చేంజర్‌’.. ‘జరగండి..’ పాట విడుదల

Mar 26,2024 19:23 #movie, #Ram Charan

రామ్‌ చరణ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘గేమ్‌ చేంజర్‌’. శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి ‘జరగండి’ పాట విడుదలకు సిద్ధమయ్యిందని తాజాగా మేకర్స్‌ ఓ పోస్టర్‌ ద్వారా తెలిపారు. ఈ రోజు (మార్చి 27) రామ్‌ చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా తమన్‌ సంగీత సారథ్యం అందిస్తోన్న ఈ చిత్రం నుండి విడుదల అవుతున్న ఈ పాటను 150 థియేటర్స్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. రామ్‌ చరణ్‌ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో శ్రీకాంత్‌, ఎస్‌.జె.సూర్య, సునీల్‌ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై జీ స్టూడియోస్‌ అసోసియేషన్‌లో నిర్మాతలు దిల్‌ రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు,తమిళ, హిందీ భాషల్లో వరల్డ్‌ వైడ్‌గా ఈ చిత్రాన్ని గ్రాండ్‌ లెవల్లో రిలీజ్‌ చేస్తున్నారు.

➡️