రేపు తిరుపతిలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

Feb 3,2024 19:30 #movie

తిరుపతిలోని మహతి ఆడిటోరియం (బాలాజీ కాలనీ)లో ఆదివారంనాడు అంతర్జాతీయ చలన చిత్రోత్సవం జరగనుంది. నెట్‌ప్లిక్స్‌ ఇండియాతో కలిసి యుఎన్‌ఎఫ్‌ఐఎన్‌ (యునైటెడ్‌ ఫిల్మ్‌ ఇన్వెస్టర్‌ నెట్‌వర్క్‌)తోపాటు ఇండియన్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఎంట్రీలను ఈనెల ఒకటోతేదీ వరకూ స్వీకరించిన ప్రతినిధులు ఆదివారం జరిగే వేడుకల్లో స్క్రీనింగ్‌ చేయనున్నారు. ఫీచర్‌ ఫిల్మ్‌లు, షార్ట్‌ ఫిల్మ్‌లు, మ్యూజిక్‌ వీడియోలు, వెబ్‌ సిరీస్‌లను ఇప్పటికే ఆహ్వానించారు. జాతీయ, అంతర్జాతీయ సినిమాలు కూడా ప్రదర్శించటంతోపాటు ప్రసారం చేస్తారు. మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకూ ఫిల్మ్‌ల స్క్రీనింగ్‌, 5 నుంచి 6 గంటల వరకూ ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూషన్‌ వర్క్‌షాపు, 6 నుంచి 10 గంటల వరకూ ఫిల్మ్‌ అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు. తిరుపతి ఫిలిం ఫెస్టివల్‌ కమిటీ సినిమాను షార్ట్‌లిస్ట్‌ చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సినీ ప్రముఖులు, ఆర్టిస్టులు ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు.

➡️