వరలక్ష్మి పాత్రలో ఆషికా రంగనాథ్‌

Dec 4,2023 20:08 #New Movies Updates

హీరో నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామి రంగ’. ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్‌ విజరు బిన్నీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. పవన్‌కుమార్‌ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నాగార్జున ఫుల్‌ మాస్‌ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. ఈ నేపథ్యంలోనే హీరోయిన్‌ ఆషిక రంగనాథ్‌ పాత్రను అభిమానులకు పరిచయం చేశారు. స్పెషల్‌ గ్లింప్ల్స్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. గ్లింప్స్‌ చూస్తే ఈ చిత్రంలో వరలక్ష్మి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

➡️