విజయ్ సినిమాకు టైటిల్‌ ఖరారు కాలేదు

Dec 22,2023 08:37 #movie, #vijay

‘విజయ్ (దళపతి 68) నటించనున్న తాజా సినిమాకు సంబంధించిన కొన్ని అప్‌డేట్స్‌ సోషల్‌ మీడియాలో కన్పిస్తున్నాయి. అవేమీ వాస్తవాలు కాదు’ అని నిర్మాత అర్చన కల్పతి ట్వీట్‌ చేశారు. ‘మాపై చూపిస్తోన్న అభిమానానికి ధన్యవాదాలు. దర్శకుడు వెంకట్‌ ప్రభు ఓ కొత్త కథతో రానున్నారు. బాస్‌, పజిల్‌ అనే టైటిల్స్‌ దీనికి సంబంధించినవి కావు. కొత్త సినిమా టైటిల్‌ను త్వరలోనే ప్రకటిస్తాం. అప్పటివరకూ వేచి ఉండండి’ పేర్కొన్నారు. ఇదిలావుండగా విజరు సినిమా షూటింగ్‌ విదేశాల్లో జరుగుతోంది. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా, ప్రభుదేవా, స్నేహ, లైలా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

➡️