‘హనుమాన్‌’ ఓటీటీ ఆలస్యం

Mar 15,2024 19:14 #movie, #teja

ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘హనుమాన్‌’ చిత్రం ఓటీటీ విడుదల ఆలస్యమవుతున్నట్లు చిత్ర దర్శకుడు వెల్లడించారు. తేజ సజ్జా కథా నాయకుడిగా నటించిన ఈ సినిమా థియేటర్‌లో విడుదలై రెండు నెలలకు పైగా అయిన ఇప్పటివరకు ఓటీటీలోకి రాలేదు. ఈ చిత్రం ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ ఎప్పుడో వచ్చింది కానీ అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఎక్స్‌ వేదికగా దీనిపై స్పందించారు. ‘హనుమాన్‌’ ఓటీటీ స్ట్రీమింగ్‌ ఆలస్యం కావడం ఉద్దేశపూర్వకంగా చేస్తున్నది కాదు. మేము రాత్రింబవళ్లు కష్టపడి మీకు బెస్ట్‌ అవుట్‌పుట్‌ అందించాలని చూస్తున్నాము. మా ఉద్దేశం ఎల్లప్పుడూ మీకు ఉత్తమమైనది ఇవ్వాలని చూస్తాము. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మాకు సపోర్ట్‌ చేయండి. ధన్యవాదాలు’ అంటూ ప్రశాంత్‌ వర్మ ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు.

➡️