హిందీలో ‘సహదేవ్‌’

Dec 16,2023 19:10 #movie, #raviteja

రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ఈగల్‌’. కార్తీక్‌ ఘట్టమనేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌. కావ్య థాపర్‌ మరో కీలక పాత్రలో నటిస్తోంది. సంక్రాతి కానుకగా ఈ సినిమాను జనవరి 13న విడుదల చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించారు. ఈ మూవీని హిందీలో ‘సహదేవ్‌’ పేరుతో విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. హిందీ వెర్షన్‌కు సంబంధించిన టీజర్‌ను శనివారం విడుదల చేశారు. నవదీప్‌, శ్రీనివాస్‌ అవసరాల, మధుబాల వంటి నటీనటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

➡️