16న సైరన్‌ విడుదల

Feb 10,2024 08:08 #keerthi suresh, #movie

జయం రవి, కీర్తి సురేష్‌, అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన తాజా చిత్రం సైరెన్‌. హోమ్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై సుజాత విజయకుమార్‌ నిర్మించారు. ఆంథోని భాగ్యరాజ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీతాన్ని అందించారు. చిత్రయూనిట్‌ చెన్నైలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించింది. జయంరవి మాట్లాడుతూ తాను రెండు డిఫరెంట్‌ పాత్రల్లో నటించానన్నారు. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ ఈ సినిమా అలరిస్తుందన్నారు. సముద్రఖని, అళగర్‌ పెరుమాళ్‌ ముఖ్యపాత్రలు పోషించారన్నారు.

➡️