రాజమండ్రికి గేమ్‌ఛేంజర్‌

Apr 8,2024 18:50 #New Movies Updates, #Ram Charan

హీరో రామ్‌చరణ్‌ దర్శకుడు శంకర్‌ కాంబినేషనల్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్‌ఛేంజర్‌’. పొలిటికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌గా పాన్‌ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ముగింపు దశలో ఉంది. ఈనెల మూడోవారం నుంచి రాజమండ్రిలో కొత్త షెడ్యూల్‌ ప్రారంభంకానుందని చిత్రబృందం ప్రకటించింది. కొద్దిరోజులు అక్కడ చిత్రీకరణ పూర్తయ్యాక మిగతా పార్టు విశాఖపట్టణంలో తెరకెక్కించనున్నారు. ఈ షెడ్యూల్‌ దాదాపు 10 రోజులకుపైగా ఉండనున్నట్లు సమాచారం. ఇందులో చరణ్‌ రెండు కోణాలున్న పాత్రలో కనిపించనున్నారు. త్వరలో విడుదల తేదీని కూడా చిత్రబృందం ప్రకటించనుంది. మరోవైపు శంకర్‌ ‘ఇండియన్‌-2’ సినిమాలో కూడా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. లైకా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎస్‌జె సూర్య, అంజలి, సునీల్‌ తదితరులు కీలకపాత్రధారులు.

➡️