రెండోసారి కేంద్ర ఆర్థికమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారమన్‌

Jun 12,2024 15:10 #nirmala sitharaman

న్యూఢిల్లీ : నిర్మలా సీతారామన్‌ కేంద్ర ఆర్థికమంత్రిగా మోడీ కెబినెట్‌లో మరోసారి చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో వరుసగా రెండోసారి ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలిమహిళగా నిర్మలా రికార్డుకెక్కారు. బుధవారం ఉదయం నార్త్‌ బ్లాక్‌కు చేరుకున్న ఆమెకు ఆర్థికశాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఈరోజు ఆమె ఆర్థికమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రెండోసారి ఆర్థికమంత్రిగా నిర్మలా వచ్చేనెలలో 2024-25 బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాగా, నిర్మలా 2014 మోడీ తొలిసారి ప్రధాని అయినప్పుడు ఆయన కేబినెట్‌లో పరిశ్రమలు, వాణిజ్యశాఖామంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2017లో రక్షణశాఖ బాధ్యతలు చేపట్టారు. ఇక 2019లో మోడీ కేబినెట్‌లో ఆర్థికమంత్రిగా నిర్మలాకు చోటు దక్కింది. ఇప్పుడు మూడోసారి మోడీ మంత్రివర్గంలో నిర్మలా ఆర్థికమంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించారు.

➡️