‘టైగర్‌ నాగేశ్వరరావు’కు అరుదైన ఘనత

May 27,2024 20:20 #New Movies Updates, #raviteja

రవితేజ కథానాయకుడిగా గత దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన టైగర్‌ నాగేశ్వరరావు సినిమా ఇప్పుడు ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ సినిమాను చెవిటి, మూగ వారి కోసం ఇండియన్‌ సైన్‌ లాంగ్వేజ్‌లో ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఘనత దక్కించుకున్న తొలి భారతీయ చిత్రంగా చరిత్రలోకి ఎక్కింది. వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించారు. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందించారు. నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రానికి థియేటర్లలో మిశ్రమ స్పందన వచ్చింది.

➡️