అభిమానులకు ప్రత్యేక విందు

Mar 4,2024 19:59 #Actors, #Tamil Nadu

గతేడాది డిసెంబర్‌లో వచ్చిన మిగ్‌జాం తుపానుకు చెన్నై మహా నగరం అతలాకుతలమైంది. సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలు కూడా ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో తన అభిమానులందరూ స్వచ్ఛందంగా వచ్చి బాధితులను ఆదుకోవాలని సూర్య కోరారు. రూ.10 లక్షలు ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. దీంతో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఫ్యాన్స్‌ భోజనాలు ఏర్పాటు చేసి పలు సేవలు చేశారు. తాజాగా సూర్య ఆ సేవలను గుర్తించి వాళ్లందరినీ విందుకు ఆహ్వానించారు. వారికి స్వయంగా ఆయనే వడ్డించారు.

➡️