నటి మమితాబైజుకు మరోఛాన్స్‌

Mar 14,2024 19:49 #movie, #New Movies Updates

కోలివుడ్‌ నటి మమితాబైజుకు మరో సినిమాలో నటించే అవకాశం లభించింది. ఇటీవల వచ్చిన ‘ప్రేమలు’ సినిమాలో ఆమె నటించిన విషయం తెలిసిందే. కోలీవుడ్‌ హీరో విష్ణువిశాల్‌ నటిస్తున్న 21వ చిత్రంలో కథానాయికగా మమితాబైజును ఎంపికచేస్తున్నట్లుగా సమాచారం. కోలీవుడ్‌లో జీవీ ప్రకాష్‌కుమార్‌ నరసన ‘రెబల్‌’ చిత్రంలో ఆమె మొదటిసారిగా నటిగా రంగ ప్రవేశం చేశారు. తాజాగా విష్ణువిశాల్‌ సినిమాలో అవకాశం వచ్చింది. దర్శకుడు రామ్‌కుమార్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

➡️