యావరేజ్‌ స్టూడెంట్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల

May 18,2024 19:51 #New Movies Updates

‘మెరిసే మెరిసే’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన పవన్‌ కుమార్‌ కొత్తూరి హీరోగా మారారు. ఆయన హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘యావరేజ్‌ స్టూడెంట్‌ నాని’. స్నేహా మాలవ్య, సాహిబా భాసిన్‌, వివియా సంత్‌ హీరోయిన్లుగా నటించారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్‌ కుమార్‌ కొత్తూరి, బిషాలీ గోయెల్‌ నిర్మించిన ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా పవన్‌ కుమార్‌ కొత్తూరి మాట్లాడుతూ ”యూత్‌ఫుల్‌ లవ్‌, యాక్షన్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘యావరేజ్‌ స్టూడెంట్‌ నాని’. అన్ని తరగతుల ప్రేక్షకులకు మా సినిమా నచ్చుతుందనే నమ్మకం ఉంది” అన్నారు. ఝాన్సీ, రాజీవ్‌ కనకాల, ‘ఖలేజా’ గిరి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్‌ బి. కొడకండ్ల, కెమెరా: సజీష్‌ రాజేంద్రన్‌.

➡️