‘బ్యాడ్‌’ థీమ్‌ సాంగ్‌ విడుదల

May 10,2024 19:25 #movie, #viswaksen

హీరో విశ్వక్‌ సేన్‌, హీరోయిన్‌గా నేహా శెట్టి నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. ఇందులో విశ్వక్‌ ‘లంకల రత్న’ అనే పాత్రలో కనువిందు చేయనున్నాడు. ఈ సినిమాకి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘సుట్టంలా సూసి’, ”మోత’ పేరుతో రెండు పాటలు విడుదల చేశారు. ఈ రెండు పాటలూ సామాజిక మాధ్యమాల్లో బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు ‘బ్యాడ్‌’ థీమ్‌ సాంగ్‌ను శనివారం ఆవిష్కరించారు. ఈ ‘బ్యాడ్‌’ గీతం చిత్రంలోని చీకటి ప్రపంచాన్ని, అందులోని పాత్రలను పరిచయం చేస్తూ సాగింది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఈ పాటను రాశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 31న ఈ సినిమా విడుదల కానుంది.

➡️