‘జీ2’లో బనితా సంధు

Mar 30,2024 19:15 #adavi seshu, #movie

అడివి శేష్‌ హీరోగా 2018లో వచ్చిన ‘గూఢచారి’ సినిమాకు సీక్వెల్‌గా గూఢచారి-2(జీ2) తెరకెక్కుతోంది. అడివి శేషు హీరోగా నటిస్తున్నారు. హీరోయిన్‌గా బనితాసంధు నటిస్తున్నారు. ‘అక్టోబర్‌’, ‘సర్దార్‌ ఉదరు’ వంటి హిందీ చిత్రాల్లోనూ, తమిళ చిత్రం ‘ఆదిత్యవర్మ’తో ఆమె హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా జీ2 ద్వారా ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. వినరుకుమార్‌ సిరిగినీడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం గుజరాత్‌లోని భుజ్‌లో షూటింగ్‌ జరుగుతోంది. బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ కీలకపాత్ర చేస్తున్నారు.

➡️