రామ్‌చరణ్‌తో కలిసి నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్‌ బుచ్చిబాబు

Feb 7,2024 17:59 #Ram Charan

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఉప్పెన మూవీ డైరెక్టర్‌ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ ఖరారు కాలేదు. ‘ఆర్‌సి 16’ పేరుతో త్వరలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ సినిమా ఉత్తరాంధ్రలో జరిగే క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతుంది. అయితే ఇందులో నటించేందుకు ఆసక్తిగల ఔత్సాహిక నటీనటులకు దర్శకుడు బుచ్చిబాబు తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చాడు. ఈ సినిమా ఉత్తరాంధ్ర ప్రాంత కథ కావడంతో.. ఆ ప్రాంతానికి చెందిన ఔత్సాహిక నటీనటుల అవసరం ఈ సినిమాకు ఉంది. అందుకే.. ఉత్తరాంధ్ర భాష అనర్గళంగా మాట్లాడగల నటీనటుల కోసం ‘ఆర్‌సి 16’ టీమ్‌ ఫిబ్రవరి 7 నుంచి 17వ తేదీ వరకూ ఆడిషన్స్‌ నిర్వహిస్తోంది. ఈ అవకాశాన్ని విజయనగరం, సాలూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాలకు చెందినవారు .. నటనపై ఇంట్రెస్ట్‌ ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని బుచ్చిబాబు వెల్లడించాడు. దీనికి సంబంధించిన వీడియోను బుచ్చిబాబు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.

➡️