‘దేవర’ ఫియర్‌ సాంగ్‌ విడుదల

ఎన్టీఆర్‌- కొరటాల శివ కాంబినేషన్‌లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా దేవర. మే 20న తారక్‌ పుట్టినరోజు సందర్భంగా తాజాగా దేవర నుంచి ఫస్ట్‌ సాంగ్‌ను మేకర్స్‌విడుదల చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుద్‌ సంగీతం అందించాడు. ఈ పాటను తెలుగులో రామజోగయ్య శాస్త్రి ,హిందీలో మనోజ్‌ ముంతాషిర్‌, తమిళంలో విష్ణు ఏడవన్‌, కన్నడలో ఆజాద్‌ వరదరాజ్‌, మలయాళంలో గోపాలకృష్ణన్‌ రచించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటిస్తున్నాడు.

➡️