రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ప్రజాశక్తి-మచిలీపట్నం రూరల్‌ : లారీని ఓవర్‌టేక్‌ చేయబోతుండగా బైక్‌ పై నుండి మహిళ రోడ్డుపై పడింది.. ఆ లారీ టైరు ఆమెపై ఎక్కడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మంగళవారం మచిలీపట్నం బుట్టాయిపేట సెంటర్‌ లో జరిగింది. రేపల్లెకు చెందిన మోపిదేవి రాజేశ్వరి అనే మహిళ తన భర్త, కుమారుడితో కలిసి తాళ్లపాలెంలో జరిగిన ఓ శుభ కార్యక్రమానికి హాజరై తిరిగి బైక్‌ పై బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న బైక్‌ ఎదురుగా వెళుతున్న లారీని ఓవర్‌ టేక్‌ చేయగా రాజేశ్వరి కింద పడిపోయింది. రాజేశ్వరి మీద నుండి లారీ టైర్‌ ఎక్కడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️