నేను రిలేషన్‌లో ఉన్నా : విజయ్ దేవరకొండ

Mar 30,2024 19:05 #movie, #vijay devarakonda

‘నేను రిలేషన్‌లోనే ఉన్నాను. నా తల్లిదండ్రులు, సోదరుడు, స్నేహితులతో రిలేషన్‌షిప్‌లో ఉన్నా’ అని హీరో విజయ్ దేవరకొండ వ్యాఖ్యానించారు. విజయ్ దేవరకొండ, మృణాల్‌ఠాకూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్‌’. ఏప్రిల్‌ 5న ఈ సినిమా విడుదల కానుంది. ప్రమోషన్‌లో భాగంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. తన రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ ‘ది’ ట్యాగ్‌పై ఆయన స్పందించారు. ”ప్యామిలీస్టార్‌’ ప్రతిఒక్కరికీ నచ్చే సినిమా. ఇలాంటి కథలో భాగం కావటం అదృష్టంగా భావిస్తున్నా. పరశురామ్‌ తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా కథ రాశారు. ఆ కథ విన్నప్పుడు హీరో పాత్ర నిజజీవితానికి దగ్గరగా ఉందనిపించింది. నటుల పేరు ముందు స్టార్‌ ట్యాగ్స్‌ పెట్టే సంప్రదాయం ఎక్కడ నుంచి వచ్చిందో నాకు తెలియదు. నా చిత్రాల నిర్మాతలు కూడా నాకు ఏదైనా టైటిల్‌ పెట్టాలని చూశారు. వాళ్లకు ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేవాడిని. నా పేరు నాకు సరిపోతుందని భావించా. నా కేమైనా టైటిల్‌ పెట్టాలనుకుంటే కేవలం ‘ది’ అని యాడ్‌ చేయాలని ఇటీవల చెప్పా. దానికి మంచి నాకు ఏమీ నచ్చదు’ అంటూ వ్యాఖ్యానించారు.

➡️