జనవరి 25న ‘ఫైటర్’ విడుదల

Nov 25,2023 14:50 #Bollywood, #New Movies Updates
fighter movie release date out

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ‘హృతిక్ రోషన్’ నటిస్తున్న ‘ఫైటర్’ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. వచ్చే సంవత్సరం జనవరి 25న ఫైటర్ సినిమా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పఠాన్ మూవీని డైరెక్ట్ చేసిన సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండడం అంచనాలు భారీగా పెరిగాయి. ఫైటర్ సినిమాలో హృతిక్ రోషన్ ‘ఫైటర్ జెట్ పైలట్’గా కనిపించనున్నాడు. దీపికా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో ఇండియన్ స్క్రీన్ పైన ఇప్పటివరకూ చూడని యాక్షన్ ఎపిసోడ్స్ ని చూడబోతున్నామని ప్రచారం జరుగుతుంది. ఇటీవలే ఈ మూవీ నుంచి ఇండిపెండెన్స్ డే సంధర్భంగా మేకర్స్ ఫైటర్ సినిమా గ్లిమ్ప్స్ ని విడుదల చేశారు. హ్రితిక్ రోషన్, దీపికా లుక్ ని రివీల్ చేసిన మేకర్స్… లేటెస్ట్ గా ఫైటర్ టీజర్ ని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. డిసెంబర్ 5న ఫైటర్ టీజర్ రిలీజ్ చేసే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల సమాచారం.

➡️