కల్యాణ్‌రామ్‌ షూటింగ్‌లో అగ్నిప్రమాదం

May 10,2024 19:10 #kalyan ram, #movie

కల్యాణ్‌ రామ్‌ కొత్త సినిమా షూటింగులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు రూ.4 కోట్లు విలువైన సెట్‌ కాలి బూడిద అయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. కల్యాణ్‌ రామ్‌ హీరోగా ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌.. కొన్నిరోజుల నుంచి హైదరాబాద్‌లో జరుగుతోంది. సీబీఐకి సంబంధించిన సీన్స్‌ తీస్తున్నారు. 9 రోజుల షూటింగ్‌ ఇప్పటికే పూర్తవగా, మరో రోజు చిత్రీకరణ మిగిలి ఉంది. ఈ క్రమంలోనే ఊహించని విధంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో సెట్‌ మొత్తం కాలిపోయింది. ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

➡️