ఆ పేరు ఉన్న వాళ్లకు ఉచితం..

పార్వతీశం నటిస్తున్న ‘మార్కెట్‌ మహాలక్ష్మి’ చిత్రాన్ని వీఎస్‌ ముఖేశ్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో ప్రణీకాన్వికా హీరోయిన్‌గా పరిచయం కానున్నారు. హర్ష వర్ధన్‌, ముక్కు అవినాశ్‌, మహబూబ్‌ బాషా తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 29న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. ప్రమోషన్లలో భాగంగా తాజాగా చిత్రబృందం ఓ ప్రకటన చేసింది. మహాలక్ష్మి పేరుతో ఉన్న వారికి తమ సినిమా టికెట్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మొత్తం 200 టికెట్లను ఇలా ఉచితంగా ఇవ్వనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఒక వీడియోను రిలీజ్‌ చేసింది. ‘మీ ఇంట్లో ఎవరైనా మహాలక్ష్మి అనే పేరుతో ఉన్నారా? ఒక వేళ ఆ పేరుతో ఎవరైనా ఉంటే వెంటనే మీ ఐడీ ప్రూఫ్‌ను 9005500559కి వాట్సాప్‌ చేయండి’ అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు హీరో, హీరోయిన్లు.

➡️