‘హ్యాపీ ఎండింగ్‌’ ట్రైలర్‌ రిలీజ్‌

Jan 22,2024 20:21 #movies

యష్‌ పూరి హీరోగా నటించిన చిత్రం ‘హ్యాపీ ఎండింగ్‌’. అపూర్వ రావ్‌ హీరోయిన్‌. హమ్స్‌ టెక్‌ ఫిలింస్‌, సిల్లీ మాంక్స్‌ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మించాయి. యోగేష్‌కుమార్‌, సంజరురెడ్డి, అనిల్‌ పల్లాల నిర్మాతలు. కౌశిక్‌ భీమిడి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 2న ఈ సినిమా విడుదల కానుంది. సోమవారంనాడు సినిమా ట్రైలర్‌ను డైరెక్టర్‌ వేణు ఊడుగుల విడుదల చేశారు. ఎడిటర్‌ ప్రదీప్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ రవి నిడమర్తి తదితరులు మాట్లాడారు. ఈ సినిమాలో అజరుఘోష్‌, విష్ణు, ఝాన్సీ, అనితచౌదరి, హర్ష్‌ రోషన్‌, జియ శర్మ, వంశీ నెక్కంటి, కెఎంఎం మణి, కమల్‌ తుము, శ్వేత తదితరులు నటిస్తున్నారు.

➡️