‘హరోం హర’ విడుదల వాయిదా

May 21,2024 19:05 #movie, #sudheer babu

సుధీర్‌ బాబు నటించిన ‘హరోం హర’ సినిమా విడుదల వాయిదా పడింది. మే 31న విడుదల చేస్తున్నామని గతంలో చిత్రబృందం ప్రకటించింది. తాజాగా జూన్‌ 14న విడుదల చేస్తున్నట్లు కొత్త అప్డేట్‌ ఇచ్చింది. జ్ఞానశేఖర్‌ ద్వారక ఈ చిత్రానికి దర్శకుడు, మాళవిక శర్మ కథానాయికగా నటించారు. సునీల్‌ ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తారు. చిత్తూరు నేపథ్యంలో జరిగిన ఒక పీరియడ్‌ డ్రామా ఇది.

➡️