హిట్‌ లిస్ట్‌ టీజర్‌ బాగుంది: సూర్య

May 18,2024 19:56 #hero surya, #New Movies Updates

”హిట్‌ లిస్ట్‌’ మూవీ టీజర్‌ చాలా బాగుంది. సినిమా ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాను. విజరు కనిష్కతో పాటు టీమ్‌కి ఈ మూవీ మంచి సక్సెస్‌ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని హీరో సూర్య అన్నారు. తమిళ దర్శకుడు విక్రమన్‌ తనయుడు విజరు కనిష్క హీరోగా సముద్ర ఖని, శరత్‌కుమార్‌, గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘హిట్‌ లిస్ట్‌’. సూర్య కతిర్‌ కాకల్లార్‌, కె.కార్తికేయన్‌ దర్శకత్వం వహించారు. దర్శకుడు కెఎస్‌ రవికుమార్‌ నిర్మించారు. ఈ మూవీని శ్రీ శ్రీనివాస స్క్రీన్స్‌, శ్రీ శ్రీనివాస ఇన్‌ఫ్రా, బెక్కం ప్రొడక్షన్స్‌ సంస్థలు తెలుగులో విడుదల చేస్తున్నాయి. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌ని సూర్య ఆవిష్కరించారు. ”యాక్షన్‌, సస్పెన్స్‌, క్రైమ్‌ జానర్‌లో రూపొందిన చిత్రం ‘హిట్‌ లిస్ట్‌’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది” అని మేకర్స్‌ వ్యాఖ్యానించారు.

➡️