Murder case : కన్నడ స్టార్‌ హీరో దర్శన్‌ అరెస్ట్‌

కర్నాటక : కన్నడ స్టార్‌ హీరో దర్శన్‌ అరెస్టయ్యారు. ఈ నెల 8న రేణుకా స్వామి అనే వ్యక్తి అనుమానాస్పద రీతిలో శవమై కనిపించాడు. ఇతడిని ఎవరు చంపారనే కోణంలో ఆరా తీయగా.. హీరో దర్శన్‌ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం తనతో రిలేషన్‌లో ఉన్న పవిత్ర గౌడని రేణుకాస్వామి అనే అభిమాని ఇబ్బంది పెట్టడంతోనే దర్శన్‌ కోపం పెంచుకుని రేణుకా స్వామిని హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు దర్శన్‌ సహా 11 మందిని అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం దర్యాప్తు సాగుతోంది. అయితే దర్శన్‌ అరెస్ట్‌ వల్ల కన్నడ ఇండిస్టీకి చెడ్డ పేరు వస్తుందని ప్రముఖ కన్నడ హీరో సుదీప్‌ ఆవేదన వ్యక్తం చేశారు.


” మీడియాలో ఏం చూపిస్తున్నారో మాకు కూడా అంతే తెలుసు. ఎందుకంటే మేం నేరుగా పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి అడగలేం కదా! నిజాన్ని బయటపెట్టేందుకు పోలీసులు, మీడియా చాలానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో సందేహం లేదు. హత్యకు గురైన రేణుకా స్వామి కుటుంబానికి, అతడికి పుట్టబోయే బిడ్డకు న్యాయం జరగాలి. ఈ కేసులో న్యాయం గెలవాలి. అయితే దర్శన్‌ అరెస్ట్‌ అవడంతో నింద అంతా సినిమా ఇండస్ట్రీ పై వేస్తున్నారు. ఫిల్మ్‌ ఇండిస్టీకి న్యాయం జరగాలి.. కన్నడ చిత్రపరిశ్రమలో ఎందరో నటులున్నారు. ఇది ఏ ఒక్కరికో ఇద్దరికో సంబంధించనది కాదు. నిందితుడికి శిక్ష పడితే ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంటుంది ” అని సుదీప్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

➡️