కుంభకోణంలో కార్తి సినిమా షూటింగ్‌

Nov 17,2023 18:40 #New Movies Updates

కోలివుడ్‌లో కార్తి నటించిన సినిమా జపాన్‌ సినిమా నిరాశపర్చిన విషయం తెలిసిందే. రాజు మురుగన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అభిమానుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. దీంతో బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. స్క్రీన్‌ప్లే, మేకింగ్‌ విషయంలో సినిమా పూర్తిగా విఫలమైందనే విమర్శలు కూడా వచ్చాయి. దాని నుంచి బయటపడేందుకు తన 27వ సినిమాకు సిద్ధమయ్యాడు. డైరెక్టర్‌ ప్రేమ్‌కుమార్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. శుక్రవారంనాడు కుంభకోణం ప్రాంతంలో షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ చిత్రాన్ని సూర్యకు చెందిన 2డి సంస్థ నిర్మిస్తోంది. నలన్‌ కుమారస్వామి దర్శకత్వంలో కార్తీ 26లో కూడా నటిస్తున్నాడు. ఒకేసారి రెండు సినిమాల్లో నటిస్తున్న కార్తీ.. జపాన్‌తో వచ్చిన డ్యామేజిని కంట్రోల్‌ చేసే పనిలో కార్తి ఉన్నాడని తెలుస్తోంది.

➡️