వివాహ బంధంలోకి అడుగుపెట్టిన కిరాక్‌ ఆర్పీ

Nov 30,2023 16:36

 

ఇంటర్నెట్‌డెస్క్‌ : జబర్దస్త్‌ ఫేమ్‌ కిరాక్‌ ఆర్పీ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తాను ప్రేమించిన లక్ష్మీ ప్రసన్నతో కలిసి ఏడడుగులు వేశారు. వీరి వివాహం నవంబర్‌ 29న రాత్రి వైజాగ్‌లోని ఓ హోటల్‌లో ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది. కాగా, ఈ జంట 2022 మేలో నిశ్చితార్థం చేసుకుంది. ఎంగేజ్‌మెంట్‌ ఘనంగా జరుపుకున్న ఈ జంట.. వివాహం మాత్రం ఎలాంటి హడావిడి లేకుండా చేసుకుంది. కిరాప్‌ ఆర్పీ ‘వజ్ర కవచధర గోవింద’, ‘ఇదేం దెయ్యం’, ‘ఎంఎంఓఎఫ్‌’ వంటి తదితర చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆర్‌పి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో.. హోటల్స్‌ నడుపుతున్నారు.

➡️