‘ఫ్యామిలీ మ్యాన్‌’ సిరీస్‌ నుంచి సరికొత్త అప్‌డేట్‌

May 6,2024 18:37 #New Movies Updates, #web series

దేశభక్తితోపాటుగా ఓ మధ్య తరగతి వ్యక్తి జీవిత నేపథ్యంగా తీసిన ‘ఫ్యామిలీ మ్యాన్‌’ సిరీస్‌ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ అందుకుంది. తెలుగు దర్శక ద్వయం రాజ్‌-డీకే తీసిన ఈ సిరీస్‌లో మనోజ్‌ భాజ్‌పారు-ప్రియమణి జంటగా నటించారు. 2019 సెప్టెంబరు 20న అమెజాన్‌ ప్రైమ్‌లో తొలి సీజన్‌ రిలీజైంది. కామెడీ, యాక్షన్‌, దేశభక్తి ఇలా అన్ని అంశాలతో తీసిన ఈ సిరీస్‌ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. రెండో సీజన్‌.. 2021 జూన్‌ 4న రిలీజ్‌ చేశారు. తొలి భాగమంతా కానప్పటికీ మంచి స్పందన దక్కించుకుంది. అయితే మూడో సీజన్‌.. కరోనా వ్యాక్సిన్‌ బ్యాక్‌ డ్రాప్‌, రెండో సీజన్‌ వచ్చి మూడేళ్లు అవుతున్నా ఇప్పటికీ అప్డేట్‌ లేకపోయేసరికి చాలామంది దీని గురించి మర్చిపోయారు. సరిగ్గా ఇలాంటి టైంలో మూడో సీజన్‌ షుటింగ్‌ మొదలైందని డైరెక్టర్లు ప్రకటించారు. లొకేషన్‌ నుంచి ఓ ఫొటో కూడా కూడా విడుదల చేశారు. వచ్చే ఏడాది దీనిని విడుదల చేయనున్నారు.

➡️