11న ‘లవ్‌ గురు’

విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లవ్‌ గురు’ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా ఈ నెల 11న విడుదల అవుతుంది. సినిమా విశేషాలను విజయ్ ఆంటోనీ ముచ్చటించారు. ‘ఈ సినిమా కథ విన్నప్పుడు ఇది సాధించబోయే విజయం మీద నమ్మకం కలిగింది. ఈ చిత్రంలో ఫెంటాస్టిక్‌ ఫ్యామిలీ కామెడీ చూస్తారు. సినిమా చూశాక మీ జీవిత భాగస్వామిని ప్రేమించడం ఎలాగో తెలుసుకుంటారు. డైలాగులు చాలా సహజంగా ఉంటాయి. దర్శకుడు వినాయక్‌ న్యాచురల్‌గా రాశారు. నాకు మెమరీ పవర్‌ తక్కువ. తెలుగు భాష నేర్చుకోలేకపోయాను. నాకు తెలుగు వచ్చి ఉంటే తెలుగులోనే నేరుగా సినిమాలు చేసేవాడిని. అలాంటి అవకాశం ఉంటే చెన్నై వదిలి వచ్చి ఇక్కడే సినిమాలు చేస్తా. నేనొక సినిమా చేస్తే దాని నిర్మాణ బాధ్యతలు, ఎడిటింగ్‌, నటించడం, అన్ని భాషల్లో ప్రమోషన్‌ చేయడం వీటికే టైమ్‌ సరిపోతోంది’ అని అన్నారు.

➡️