మళ్లీ ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ..!

May 18,2024 13:42 #again, #nagababu, #re-entry, #Twitter

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల వేళ… ‘మా వాడు, పరాయి వాడు’ అంటూ నాగబాబు చేసిన ట్వీట్‌ వైరల్‌ గా మారిన సంగతి తెలిసిందే. తమ హీరోను ఉద్దేశించే నాగబాబు ఈ ట్వీట్‌ చేశారంటూ … హీరో అల్లు అర్జున్‌ అభిమానులు నాగబాబుపై మండిపడుతున్నారు. దీంతో నాగబాబు ట్విట్టర్‌ ను డియాక్టివేట్‌ చేసుకున్నారు. తాజాగా నాగబాబు మళ్లీ ట్విట్టర్‌ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ పోస్టును డిలీట్‌ చేశానంటూ ఒక్క వాక్యంలో వివరణ ఇచ్చి గొడవకు ఫుల్‌ స్టాప్‌ పెట్టే ప్రయత్నం చేశారు.

నాగబాబు ట్వీట్‌ ….
తమతో ఉంటూ ప్రత్యర్థుల కోసం పని చేసేవాడు తమ వాడైన పరాయివాడేనని, తమతో నిలబడేవాడు పరాయివాడైన తమ వాడేనంటూ పోస్ట్‌ పెట్టారు. ఇది అల్లు అర్జున్‌ ను ఉద్దేశించిందేనని ప్రచారం జరిగింది. ఎందుకంటే.. నంద్యాల సిట్టింగ్‌ ఎమ్మెల్యే, వైసిపి అభ్యర్థి శిల్పా రవిచంద్ర తరఫున అల్లు అర్జున్‌ ప్రచారం చేశారు. నంద్యాలకు వెళ్లి శిల్పా రవిచంద్రను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. అయితే, స్వయానా మేనమామ పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నా అల్లు అర్జున్‌ అటువైపు తొంగిచూడలేదు. దీనిని దృష్టిలో పెట్టుకునే నాగబాబు ఈ ట్వీట్‌ చేశారని అల్లు అర్జున్‌ అభిమానులు విమర్శలు చేశారు.

➡️