సెప్టెంబర్‌లో జాతీయ స్థాయి తెలుగు షార్ట్‌ఫిల్మ్‌ పోటీలు

Jun 15,2024 23:05 #movie

ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ :జాతీయస్థాయి తెలుగు షార్ట్‌ఫిల్మ్‌ పోటీలు సెప్టెంబర్‌ 21, 22 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలుగు షార్ట్‌ఫిల్మ్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు బి.కె.ఎన్‌.ఎస్‌ ప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి డి.వి.రాజు తెలిపారు. ఎన్‌టిఆర్‌ జిల్లా విజయవాడలోని ఎంబి భవన్‌లో వారు శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సెప్టెంబరు 21న గురజాడ అప్పారావు జయంతి, 22న ప్రముఖ గాయకులు పిబి.శ్రీనివాస్‌ జయంతి సందర్భాలను పురస్కరించుకొని రెండు రోజులపాటు మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలోని చుక్కపల్లి పిచ్చియ్య ఆడిటోరియంలో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం ప్రయివేటు పాటల వీడియో పోటీలు, రీల్స్‌ పోటీలు జరుగుతాయని తెలిపారు. షార్ట్‌ ఫిల్మ్‌కు మొదటి బహుమతి రూ.10 వేలు, రెండో బహుమతి రూ.7 వేలు, మూడో బహుమతి రూ.5 వేలు, ప్రయివేటు పాటల వీడియో పోటీలకు మొదటి బహుమతి రూ.5 వేలు, రెండో బహుమతి రూ.3 వేలు, మూడో బహుమతి రూ.2 వేలు, రీల్స్‌లో మొదటి బహుమతి రూ.3 వేలు, రెండో బహుమతి రూ.2 వేలు, మూడో బహుమతి వెయ్యి రూపాయలు ఉంటుందని చెప్పారు. ఎంట్రీ ఫీజు రీల్స్‌కు రూ.200, షార్ట్‌ ఫిల్మ్‌, ప్రయివేటు పాటల వీడియోలకు రూ.500లుగా నిర్ణయించినట్లు తెలిపారు. సెప్టెంబర్‌ 10వ తేదీలోపు వీడియోలను పంపాలని కోరారు.

➡️