15న ‘ఓం భీమ్‌ బుష్‌’ ట్రైలర్‌

Mar 13,2024 19:49 #New Movies Updates, #released, #triler

శ్రీవిష్ణు, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓం భీమ్‌ బుష్‌’. నో లాజిక్‌.. ఓన్లీ మ్యాజిక్‌ ఉపశీర్షిక. రీతూవర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాకు ‘హుషార్‌’ ఫేమ్‌ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్‌ వేగం పెంచింది చిత్రయూనిట్‌. తాజాగా ఈ సినిమా నుంచి చిత్రబృందం ట్రైలర్‌ అప్‌డేట్‌ ఇచ్చింది. ఈ మూవీ ట్రైలర్‌ను మార్చి 15న విడుదల చేయనున్నట్లు ఎక్స్‌ వేదికగా ప్రకటించింది. వి.సెల్యులాయిడ్‌తో కలిసి సునీల్‌ బలుసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యు.వి.క్రియేషన్స్‌ సంస్థ సమర్పిస్తోంది.

➡️