‘పారిజాత పర్వం’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌

Apr 16,2024 17:52 #New Movies Updates, #released, #teaser

చైతన్య రావు, సునీల్‌, శ్రద్ధా దాస్‌, మాళవిక సతీశన్‌ ప్రధాన పాత్రల్లో వనమాలి క్రియేషన్స్‌ బ్యానర్‌పై సంతోష్‌ కంభంపాటి దర్శకత్వంలో మహీధర్‌ రెడ్డి, దేవేష్‌ నిర్మించిన హిలేరియస్‌ క్రైమ్‌ కామెడీ ఎంటర్‌ టైనర్‌ ‘పారిజాత పర్వం’. ‘కిడ్నాప్‌ ఈజ్‌ ఎన్‌ ఆర్ట్‌’ అనేది ట్యాగ్‌ లైన్‌. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్‌ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. యాక్షన్‌, కిడ్నాప్‌ డ్రామా, ఫన్‌ ఇలా అన్ని ఎలిమెంట్స్‌ను మేళవించి రూపొందించిన ఈ సినిమా ఏప్రిల్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ హైదరాబాద్‌ దసపల్లా హౌటల్‌ లో అంగరంగ వైభవంగా ప్రీరిలీజ్‌ వేడుకను నిర్వహించింది. ‘పారిజాత పర్వం ప్రీ కిడ్నాప్‌ ఈవెంట్‌’ పేరుతో వెరైటీగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్‌ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘పారిజాత పర్వం’ బిగ్‌ టికెట్‌ ను చీఫ్‌ గెస్ట్‌, స్టార్‌ ప్రొడ్యూసర్‌ టీజీ విశ్వప్రసాద్‌ గారు లాంచ్‌ చేశారు.

➡️