ప్రియదర్శి ‘డార్లింగ్‌’ పూర్తి చేశారు

May 10,2024 19:15 #movie, #priyadarsi

ప్రియదర్శి, నభా నటేష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘డార్లింగ్‌’. ఈ సినిమాకు అశ్విన్‌ రామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కె. నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా మూవీ నుంచి మరో అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. ఈ సినిమా షూటింగ్‌ ముగించినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ఒక ఫొటోను కూడా విడుదల చేసింది. వివేక్‌ సాగర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అనన్య నాగళ్ల, మోయిన్‌, శివా రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌, కళ్యాణి రాజ్‌, సునీత మనోహర్‌, ముళ్లపూడి రాజేశ్వరి, అభిజ్ఞ, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

➡️