జూన్‌ 13న ‘రాయన్‌’

May 6,2024 18:43 #Dhanush, #moviies

ధనుష్‌ తన సొంత దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘రాయన్‌’. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది. జూన్‌ 13వ తేదీ గురువారం ప్రపంచవ్యాప్తంగా రాయన్‌ సినిమాని విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ చిత్రంలో అపర్ణ బాలమొరళి, దుషారా విజయన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రకాష్‌ రాజ్‌, విష్ణు విశాల్‌, కాళిదాస్‌ జయరామన్‌, సందీప్‌ కిషన్‌, సెల్వ రాఘవన్‌, ఎస్‌ జే సూర్య ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఓ గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఏఆర్‌. రెహమాన్‌ సంగీతం అందించారు. సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై కళానిధి మారన్‌ ఈ చిత్రానిన నిర్మిస్తున్నారు.

➡️