అనాథ పిల్లలకు వైద్య సహాయం చేసి పెద్ద మనసు చాటుకున్న సాయిధరమ్‌తేజ్‌

Feb 23,2024 18:11 #movie, #sai dharam tej

హైదరాబాద్‌ : ప్రముఖ టాలీవుడ్‌ హీరో సాయిధరమ్‌తేజ్‌ ఎవరికి ఏ సాయం కావాలన్నా చేస్తుంటాడు. తాజాగా ఇద్దరు అనాథ చిన్నారులకు చికిత్స చేయించి తన పెద్దమనసు చాటుకున్నాడు. ఒక అనాథ శరణాలయం నుండి ఇద్దరు చిన్నారుల ట్రీట్‌మెంట్‌కు సాయం కావాలంటూ సాయిధరమ్‌ తేజ్‌కు ఫోన్‌ కాల్‌ వచ్చింది. దీంతో వెంటనే తేజ్‌ ఆ చిన్నారులకు సాయం అందించాడు. ఈ విషయాన్ని టాలీవుడ్‌ సినిమాటోగ్రాఫర్‌ ఆండ్రూ బాబు సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది.

➡️