రామ్‌చరణ్‌ చిత్రంలో శివరాజ్‌కుమార్‌

Jan 6,2024 19:30 #movie, #shiva rajkumar

రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తీసే సినిమాలో కన్నడ స్టార్‌ శివరాజ్‌కుమార్‌ నటించబోతున్నారు. రామ్‌చరణ్‌ నటిస్తున్న 16వ చిత్రం ఇది. ఈ ఏడాది వేసవిలో షూటింగ్‌ ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లుగా సమాచారం. ఈ విషయాన్ని శివరాజ్‌కుమార్‌ కూడా ధృవీకరించారు. ఉత్తరాంధ్ర నేపధ్యంలో సాగే కథతో ఈ చిత్రం రూపొందుతున్నట్లుగా సమాచారం. విజయ్ సేతుపతి, జాన్వీ కపూర్‌, త్రిష తదితర తారలు ఇందులో ఉంటారని తెలుస్తోంది. ఎఆర్‌ రెహమాన్‌ సంగీత దర్శకత్వం వహించనున్నారు.

➡️