స్ఫూర్తిదాయకంగా ‘యోధ’

Feb 26,2024 19:00 #New Movies Updates, #youdha movie

ధైర్యం, దేశభక్తి స్ఫూర్తిదాయకంగా యోధ సినిమా ఉండబోతుందని హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రా అన్నారు. ధర్మ ప్రొడక్షన్స్‌ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా ప్రమోషన్‌ కోసం ఆయనతోపాటు హీరోయిన్‌ రాశిఖన్నా హైదరాబాద్‌లోని రాజ్‌కృష్ణ హోటల్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సిద్ధార్థ్‌ మల్హోత్రా మాట్లాడుతూ యోధ సినిమాలో భాగం కావడమే ఒక అసాధారణ ప్రయాణంగా పేర్కొన్నారు. ”ఈ సినిమా అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది.” అని చెప్పారు. రాశీఖన్నా మాట్లాడుతూ, యోధలో పనిచేయటం ఒక ఉత్తేజకరమైన అనుభవం అని అన్నారు. దిశా పటాని కూడా ఈ సినిమాలో కీలకపాత్ర పోషించారు. సాగర్‌ ఆంబ్రే, పుష్కర్‌ ఓజా దర్శకత్వం వహించారు. మార్చి 15న విడుదల కానుంది.

➡️