20 నుంచి ‘సికిందర్‌’ షూటింగ్‌

May 25,2024 19:48 #New Movies Updates, #Salman Khan

బాలీవుడ్‌ కథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌ తమిళ దర్శకుడు ఎ.ఆర్‌ మురుగదాస్‌ కలయికలో వస్తున్న చిత్రం ‘సికందర్‌’. రష్మిక కథానాయిక. ఇప్పటికే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్‌ పనులు ముగింపు దశలో ఉన్నాయి. జూన్‌ 20న మొదలు కానున్న ఈ మొదటి షెడ్యూల్‌లో భాగంగా యాక్షన్‌ సీక్వెన్స్‌లనే చిత్రీకరించనున్నారు. ఇందులో యాక్షన్‌ సన్నివేశాలను సల్మాన్‌ స్వయంగా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారట. దీని కోసం ఇప్పటికే ఆయన కసరత్తులు మొదలుపెట్టారని చిత్ర వర్గాలు తెలిపాయి. సాజిద్‌ నదియాడ్‌ వాలా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఈద్‌కి విడుదల కానుంది.

➡️