80, 90వ దశకాల్లో గ్లామరస్ తారగా వెలుగొందారు సిల్క్ స్మిత. గ్లామరస్ పాత్రలు, పాటల్లో మెరిసిన ఆమె పీక్ పీరియడ్‌లో బిగ్గెస్ట్ క్రౌడ్-పుల్లర్‌గా అలరించారు. ఆమె జయంతి పురస్కరించుకొని సిల్క్ స్మిత బయోపిక్‌ను అనౌన్స్ చేశారు దర్శకుడు జయరామ్. ఇటీవల ‘వీరసింహారెడ్డి’ సినిమాలోని స్పెషల్ సాంగ్‌లో అలరించిన చంద్రిక రవి సిల్క్ స్మిత క్యారెక్టర్ చేస్తున్నారు. ఎస్‌టిఆర్‌ఐ సినిమాస్‌పై ఎస్బి విజరు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా వి.మహాస్త్రీ అమృతరాజ్ సమర్పిస్తారు. ఈ ప్రత్యేక సందర్భంలో ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించడమే కాకుండా, మేకర్స్ చంద్రిక రవి పాత్రను సిల్క్ స్మితగా పరిచయం చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో అచ్చు సిల్క్ స్మితలానే కనిపించారు చంద్రిక రవి. సినిమా రెగ్యులర్ షుట్ త్వరలో ప్రారంభమవుతుంది. ఈ చిత్రాన్ని 2024లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.