సత్యదేవ్‌ కోసం స్టార్‌ దర్శకులు

సత్యదేవ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కృష్ణమ్మ’. ఈ సినిమాకు వి.వి.గోపాల కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అరుణాచల క్రియేషన్స్‌ బ్యానర్‌లో కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారు. కొరటాల శివ సమర్పిస్తున్నారు. మే 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రీ రిలీజ్‌ వేడుకను మేకర్స్‌ భారీఎత్తున ప్లాన్‌ చేశారు. ఈ వేడుక కోసం టాలీవుడ్‌ దర్శకులు ఎస్‌ఎస్‌ రాజమౌళి, సుకుమార్‌, కొరటాల శివ, అనిల్‌ రావిపూడి, గోపిచంద్‌ మలినేని ముఖ్య అతిథులుగా రానున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్‌ మీడియాలో వెల్లడించింది. ఈ వేడుకను హైదరాబాద్‌ మాదాపూర్‌లో నిర్వహించనున్నట్లు తెలిపింది.

➡️