‘చారి 111’ నుంచి స్టైలిష్ థీమ్ సాంగ్!

Feb 20,2024 17:20 #New Movies Updates, #song release
‘చక చక మొదలిక… సాహసాల యాత్ర ఆగదిక… ఇది ఆపరేషన్ రుద్రనేత్ర’ అని ‘చారి 111’ టీమ్ అంటోంది. స్టైలిష్‌గా పిక్చరైజ్ చేసిన థీమ్ సాంగ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు యూట్యూబ్‌లో ఆ సాంగ్ వైరల్ అవుతోంది.  ‘వెన్నెల’ కిశోర్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘చారి 111’. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు. మురళీ శర్మ ప్రధాన పాత్రధారి. మార్చి 1న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ‘చారి 111’ థీమ్ సాంగ్ విడుదల చేశారు.
➡️