‘హనుమాన్‌’కు ఊహించని సక్సెస్‌

Jan 22,2024 10:35 #movie

విడుదలకు ముందే అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్న ‘హనుమాన్‌’ సినిమా ఊహించని రీతిలో విజయాన్ని సొంతం చేసుకుంది. తేజ సజ్జా, ప్రశాంత్‌ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా సాంకేతికంగా ఆకట్టుకుందనే పేరు తొలిరోజు నుంచీ వచ్చింది. తెలుగులో ఈ సబ్జెక్టు కొత్త పోకడకి తెర లేపింది. హాలీవుడ్‌ సినిమాల్లో స్పైడర్‌మ్యాన్‌, ఐరన్‌మ్యాన్‌ తరహా పాత్ర ‘హనుమాన్‌’ చిత్రంలో చూసిన ప్రేక్షకులు ఎంతో థ్రిల్‌కి గురయ్యారు. చిన్నా, పెద్దా కలసి వచ్చి సినిమాని విజయవంతం చేశారు. తక్కువ బడ్జెట్‌లో రూపొందిన ఈ చిత్రం మొదటి నుండీ పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోయింది. రెట్టింపు లాభాలను తెచ్చిపెట్టింది. ఈ వరసలో మరిన్ని సినిమాలు తీయనున్నట్టు దర్శకుడు విజయోత్సాహంతో ప్రకటించాడు.

➡️