అహో! విక్రమార్క’ టీజర్‌ నచ్చుతుంది : దేవ్‌ గిల్‌

Jun 20,2024 19:56 #New Movies Updates, #released, #teaser

‘మగధీర’తో సహా పలు దక్షిణ భారత చిత్రాల్లో విభిన్న పాత్రలు, ఆకర్షణీయమైన నటనతో దేవ్‌ గిల్‌ అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన నేతృత్వంలో దేవ్‌ గిల్‌ ప్రొడక్షన్స్‌ నుంచి ‘అహో! విక్రమార్క’ అనే మొదటి ప్రాజెక్ట్‌ రాబోతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్‌ చేశారు. దేవ్‌గిల్‌ మాట్లాడుతూ ‘మగధీర నుంచి నా మీద ప్రేమను కురిపిస్తూనే ఉన్నారు. పూణెలో మా తల్లిదండ్రులు జన్మనిచ్చి ఉండొచ్చు.. కానీ హైద్రాబాద్‌లో రాజమౌళి నాకు పేరు ఇచ్చారు. రమా నాకు తల్లిలా సపోర్ట్‌ ఇచ్చారు. వారి వల్లే ఈ రోజు ‘అహో విక్రమార్క’ అనే చిత్రాన్ని నిర్మించగలిగాను. 12, 13 ఏళ్ల క్రితం రాజమౌళి నన్ను ముంబై నుంచి పట్టుకొచ్చి నాకు లైఫ్‌ ఇచ్చారు. ఇప్పుడు నేను హీరోగా సినిమాను తీశాను. నాకు ఎంతో గర్వంగా, ఆనందంగా ఉంది. నన్ను ఇంత వరకు విలన్‌గా చూశారు. నా మీద ప్రేమను కురిపించారు. కానీ ఈ సినిమాతో మీ అందరికీ సర్‌ ప్రైజ్‌ ఇవ్వబోతోన్నాను. త్రికోటి చాలా పెద్ద విజన్‌ ఉంది. మా టీజర్‌ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. త్వరలోనే పాటలు కూడా రిలీజ్‌ చేస్తాం. మా సినిమా మీద ఆడియెన్స్‌ ప్రేమను కురిపించి, ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

➡️