”ప్రేమకథ” సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ చేసిన విజయ్ దేవరకొండ

Dec 6,2023 16:47 #movies

కిషోర్‌ కేఎస్‌ డి, దియా సితెపల్లి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ”ప్రేమకథ”. ఈ చిత్రాన్ని టాంగా ప్రొడక్షన్స్‌ ఎల్‌ఎల్‌ పీ, సినీ వ్యాలీ మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విజయ్ మట్టపల్లి, సుశీల్‌ వాజపిల్లి, శింగనమల కల్యాణ్‌ నిర్మాతలు. ఉపేందర్‌ గౌడ్‌ ఎర్ర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శివశక్తి రెడ్‌ డీ దర్శకత్వం వహిస్తున్నారు. ”ప్రేమకథ” చిత్రాన్ని త్వరలో థియేటర్స్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మంగళవారం సాయంత్రం ”ప్రేమకథ” సినిమా ట్రైలర్‌ ను స్టార్‌ హీరో విజయ్ దేవరకొండ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌లో సినిమాటోగ్రాఫర్‌ వాసు పెండెం మాట్లాడుతూ – ”ప్రేమకథ” సినిమాకు వర్క్‌ చేసే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్‌, డైరెక్టర్‌కు థ్యాంక్స్‌. మా సినిమా ట్రైలర్‌ చూశారు. మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. ఏ సినిమా ఫేట్‌ అయినా మీరు డిసైడ్‌ చేయాల్సిందే. ఇదొక డిఫరెంట్‌ లవ్‌ స్టోరి. ”ప్రేమకథ” మిమ్మల్ని ష్యూర్‌గా ఎంటర్‌ టైన్‌ చేస్తుంది”. అన్నారు.

హీరోయిన్‌ దియా సితెపల్లి మాట్లాడుతూ.. తెలుగులో నా మొదటి సినిమా ”ప్రేమకథ”. ఈ చిత్రంలో అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం టీమ్‌ అంతా కష్టపడి పనిచేశాం. ఫస్ట్‌ మూవీ కాబట్టి నేను సెట్‌ లో చాలా విషయాలు నేర్చుకున్నాను. రెగ్యులర్‌ లవ్‌ మూవీస్‌ కు మా సినిమా భిన్నంగా ఉంటుంది. మీ అందరు సపోర్ట్‌ చేస్తారని ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నా.” అని అంది.

➡️