‘ద గోట్‌’లో విజయ్ కాంత్‌

Apr 16,2024 19:15 #New Movies Updates, #vijay kanth

కోలీవుడ్‌ నటుడు విజయ్ నటిస్తున్న కొత్త ప్రాజెక్టు ‘దళపతి 68’. వెంకట్‌ ప్రభు డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమా ‘ద గోట్‌’ టైటిల్‌తో వస్తోంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి ఫీమేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. సెప్టెంబర్‌ 5న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో ఇటీవల మరణించిన నటుడు విజయ్ కాంత్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఏఐ టెక్నాలజీ సాయంతో విజరు కాంత్‌ను చూపించబోతున్నారు. ‘ఈ విషయంలో తన అనుమతి కోసం వెంకట్‌ ప్రభు తన ఇంటికి పలుసార్లు వచ్చార’ని విజయ్ కాంత్‌ సతీమణి ప్రేమలత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. పొలిటికల్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తోన్న ఈ మూవీలో కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌, ప్రశాంత్‌, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్‌ మోహన్‌, జయరాం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

➡️