ప్రతిభకు స్వాగతం!

May 2,2024 19:01 #New Movies Updates

‘హనుమాన్‌’, ‘జై హనుమాన్‌’ సినిమాలు రూపొందించిన ప్రశాంత్‌ వర్మ తన సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా మరిన్ని సూపర్‌ హీరో పాత్రలను తీసుకురానున్నట్లు ప్రకటించారు. తాజాగా దీనికి సంబంధించి ఒక అప్డేట్‌ ఇచ్చారు. సినిమాలు అంటే పిచ్చి ఉన్న ప్రతిభావంతులు అందరూ తన పీవీసీయూలో (ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌) చేరాల్సిందిగా ఆహ్వానించారు. గ్రాఫిక్స్‌, ఎడిటింగ్‌, మార్కెటింగ్‌ తదితర రంగాల్లో మంత్రముగ్ధులను చేసే నైపుణ్యం కలిగిన వారు మీ కళాత్మక శక్తిని మాతో పంచుకోండి అంటూ పిలుపిచ్చారు. అలాంటివారు తమ పోర్ట్‌ఫోలియోలను ్‌aశ్రీవఅ్‌ఏ్‌ష్ట్రవజూఙషబ.షశీఎకి పంపాలని ఎక్స్‌ వేదికగా ఒక పోస్ట్‌ పెట్టారు.

➡️