ఎండ తాపము

Mar 24,2024 05:15 #jeevana

ఎండలు ఎండలు ఎండలు
మెండుగ కాచే ఎండలు
భగభగ మండే ఎండలు
మలమల మాడ్చే ఎండలు!

మట్టి పాత్రలో నీటిని పోసి
పక్షుల దాహం తీరుద్దాం!
చలివేంద్రాలు పెట్టించి
మనుషుల దప్పిక తీర్చేద్దాం!

నీడనిచ్చే మొక్కలు నాటి
జీవుల అలసట పోగొడదాం
పిల్ల గాలుల కొలనుల్లో
చల్లగ స్నానం చేసేద్దాం

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లని
ఊరువాడా చాటేద్దాం
కొండా కోన, జలపాతాలు,
ప్రకృతి వరమని నినదిద్దాం

అటవీ సంపద పరిరక్షించి
వానలు మెండుగ పొందేద్దాం
చురచురలాడే ఎండతాపము
ఒంటి చేత్తో తరిమేద్దాం!
– గుడ్ల అమ్మాజీ, పార్వతీపురం,
73864 08306

➡️